సారవకోట: తహసిల్దార్ కార్యాలయ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

2153చూసినవారు
సారవకోట మండల తహసిల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. మంగళవారం భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నూతల భవన నిర్మాణానికి గాను కోటి 70 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసామని, దీంతో పాటుగా అదనంగా మరో 25 లక్షలు కూడా మంజూరు చేసి పనులు చేపడుతున్నామన్నారు. నిర్మాణ పనులను త్వరగా చేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్