శనివారం రాత్రి మందస మండలం బాలిగాం బ్రిడ్జ్ జంక్షన్ సమీపంలో కొబ్బరి బొండాలతో వెళ్తున్న బొలెరో పికప్ వాన్ బోల్తా పడింది. చీపురుపల్లి నుండి సంబల్పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.