శ్రీకాకుళంలో నరసన్నపేట యంగ్ క్రికెట్ అసోసియేషన్ మరియు RJ క్రికెట్ క్లబ్ పలాస మధ్య క్రికెట్ మ్యాచ్‌ను ఆంధ్ర, ఒరిస్సా క్రికెట్ అభిమానులు, రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ యూనియన్ నాయకులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా NFIR వర్కింగ్ కమిటీ సభ్యులు సిర్ల రాజశేఖర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక ఆనందాన్నిస్తాయని, గ్రీన్ ఆర్మీ అధ్యక్షులు బోనెల గోపాల్ క్రీడలు గెలుపోటములకు ఎలా స్పందించాలో నేర్పుతాయని తెలిపారు.