మందస - హరిపురం ప్రధాన రహదారి అధ్వాన్నంగా తయారైంది. రోడ్డంతా పెద్ద పెద్ద గోతులతో నిండిపోయి, వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని మొత్తుకుంటున్న, అధికారులు స్పందించడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టి తమ ప్రాణాలను కాపాడాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు.