స్వాతంత్ర్య దినోత్సవ ఆటల పోటీలు ప్రారంభం

2చూసినవారు
స్వాతంత్ర్య దినోత్సవ ఆటల పోటీలు ప్రారంభం
శ్రీకాకుళం జిల్లా మందసలోని శ్రీ రాజా శ్రీనివాస స్మారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించిన ఆటల పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మక్కా శ్రీనివాసరావు, ఇతర ఉపాధ్యాయులు ఈ పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు వివిధ ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్