శ్రీకాకుళం జిల్లా కవిటిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆటోను లారీ బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మురపాల పార్వతి, నర్తు పద్మమ్మ, మండపల్లి తరినమ్మగా గుర్తించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.