పాతపట్నం నీలమణి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు: ఎమ్మెల్యే

820చూసినవారు
పాతపట్నం మండలంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధికి 50 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఆదివారం ఉదయం విజయవాడలో దేవాలయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డిని ఎమ్మెల్యే గోవిందరావు కలిసి, పలు ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. నీలమణి ఆలయానికి నిధులు మంజూరు చేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.