కొత్తూరు మండలంలో బుధవారం స్థానిక శాసనసభ్యులు ,అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సభ్యులు మామిడి గోవిందరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
టీడీపీ కొత్తూరు మండల పార్టీ అధ్యక్షులు అగతముడి మాధవరావు, పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ అగతముడి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.