యువతలో ఎయిడ్స్ పై అవగాహన కోసం 5k రెడ్ రన్

1చూసినవారు
యువతలో ఎయిడ్స్ పై అవగాహన కోసం 5k రెడ్ రన్
ఎయిడ్స్ పై అవగాహన కల్పించడానికి 5కె రన్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈఎన్వి నరేష్ కుమార్ వెల్లడించారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో గల వాంబే కాలనీ నుండి మిల్ జంక్షన్ వరకు 5కె రన్ ను అదనపు డిఎంహెచ్ఐ డాక్టర్ తాడేల శ్రీకాంత్ తో కలసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ (AIDS) పై యువతలో అవగాహన కల్పించడానికే 'రెడ్ రన్' (Red Run) అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందన్నారు. ఇందులో 17 నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉన్న యువతీ యువకులు అందరూ కూడా పాల్గొన్నారన్నారు.

సంబంధిత పోస్ట్