ఆదివారం అన్ని బ్యాంకులు పనిచేస్తాయి.. ఎల్డిఎం శ్రీనివాస్

1చూసినవారు
ఆదివారం అన్ని బ్యాంకులు పనిచేస్తాయి.. ఎల్డిఎం శ్రీనివాస్
శ్రీకాకుళంలో ఈ నెల 28, 29, 30 తేదీలలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా సేవలకు అంతరాయం కలగనుండటంతో, ప్రజల సౌకర్యార్థం సెప్టెంబరు 27 ఆదివారం జిల్లాలోని అన్ని బ్యాంకులు సాధారణ పనిదినం మాదిరిగానే పనిచేస్తాయని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రజలు, ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ నగదు ఉపసంహరణలు, చెక్కులు, రుణాలు, ఇతర అత్యవసర బ్యాంకింగ్ పనులను ఆదివారమే పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్