పొంచి ఉన్న తుఫాన్ ప్రమాదం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. రణస్థలం మండలానికి సుడా సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. సుగుణాకరరావు, ఎచ్చెర్లకు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కె. రాజగోపాలరావు, శ్రీకాకుళం మండలానికి డ్వామా పథక సంచాలకులు బి. లవరాజు, గారకు జిల్లా పంచాయతీ అధికారి ఆర్. స్వరూపరాణి, పోలాకి మండలానికి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్. వెంకటరామన్ ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు.