రక్తదానంతోనే ప్రాణాపాయం నుండి విముక్తి..జగన్మోహనరావు

596చూసినవారు
రక్తదానంతోనే ప్రాణాపాయం నుండి విముక్తి..జగన్మోహనరావు
శ్రీకాకుళంలో శనివారం జరిగిన రక్తదాతల సన్మాన కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు మాట్లాడుతూ రక్తదానం ద్వారానే థలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు తక్షణ ప్రాణాపాయం తప్పదని స్పష్టం చేశారు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కంచిలి, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి 310 మంది రక్తదానం చేయడం ఆదర్శనీయమని కొనియాడారు. రక్తం కొరతను అధిగమించేందుకు హౌసింగ్ విభాగం చూపిన చొరవ అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాల నిర్వహణకు కృషి చేసిన పలువురిని సన్మానించారు.

సంబంధిత పోస్ట్