తల్లి చేతిలో ఇద్దరు పిల్లల దారుణ హత్య, ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం

1చూసినవారు
తల్లి చేతిలో ఇద్దరు పిల్లల దారుణ హత్య, ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్సీ కాలనీలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లల గొంతు కోసి, అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘోర దుర్ఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్