అరసవల్లి ఆలయ అభివృద్ధికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులు

647చూసినవారు
అరసవల్లి ఆలయ అభివృద్ధికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులు
శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ అభివృద్ధికి స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద కేంద్రం రూ 55.74 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నిధులతో భక్తులకు మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాలు, కనెక్టివిటీ మెరుగుపరుస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అరసవల్లికి పర్యాటకుల రాక పెరుగుతుందని, ఈ దృష్ట్యా పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతులు కల్పనకు ప్రాధాన్యత ప్రాతిపదికన ఈ నిధులు వినియోగించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్