శ్రీకాకుళం నగర శివారు పాత్రునివలసలో పాఠశాల భవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక పునరావాస కేంద్రంలో ఉంటున్న బాధిత కుటుంబాలను శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె. హరిబాబు పరామర్శించారు. పునరావాస కేంద్రంలో ఉన్న చిన్నారులు, వృద్ధులు, మహిళలతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఇళ్లు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇతర ముఖ్య పత్రాల భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు.