పట్టణాల రూపురేఖలు మార్చేందుకు సీఎం సంకల్పం

1126చూసినవారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కుప్పం నుంచి వర్చువల్ విధానంలో మున్సిపల్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) ప్రాజెక్టులను ప్రారంభించారు. పట్టణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. శ్రీకాకుళం పట్టణాభివృద్ధే లక్ష్యంగా తాగునీరు, డ్రైనేజీ, అమృత్ 2. O, స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిధులతో రూ 325. 79 కోట్లతో మౌలిక వసతుల కల్పన పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. హ్యామ్ కింద రూ 30 కోట్లతో రోడ్లు, పార్కులు, సెంట్రల్ మీడియాన్, లైటింగ్ పాయింట్లు, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్