సైకిల్ పై పీజీఆర్ఎస్ కి వచ్చిన జిల్లా కలెక్టర్

774చూసినవారు
పర్యావరణ పరిరక్షణ, వ్యాయామంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం సైకిల్ పై ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలకు సైకిల్ పై వెళ్లి విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి 86 వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణకు, ఆరోగ్యానికి సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించారు.

సంబంధిత పోస్ట్