కొత్తూరు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో జరగనున్న విచారణకు మంగళవారం మరోసారి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హాజరుకానున్నట్లు సమాచారం. గతంలో ఈనెల 22న సుమారు 10 గంటలు విచారించిన పోలీసులు, 27వ తేదీన హాజరుకావాలని నోటీసులు జారీచేశారు. అయితే, తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో 27న హాజరుకాలేకపోయారు. దీంతో మంగళవారం విచారణకు వెళ్లనున్నారు.