శ్రీకాకుళంలో తాత్కాలికంగా నిలిచిన మంచినీటి సరఫరా

0చూసినవారు
శ్రీకాకుళంలో తాత్కాలికంగా నిలిచిన మంచినీటి సరఫరా
శ్రీకాకుళంలో తుపాను ప్రభావంతో నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం శ్రీకాకుళం నగరంలో మున్సిపల్ కుళాయిల ద్వారా మంచినీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. నాగావళి నది ఉధృతి తగ్గిన అనంతరం, ఔట్ లెట్ డ్రైన్ తెరిచి, పైప్లైన్లను తనిఖీ చేసి, రేపటి నుండి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్