అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు గజ్జెల పండుగ, అన్నప్రాసన కార్యక్రమం

2చూసినవారు
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు గజ్జెల పండుగ, అన్నప్రాసన కార్యక్రమం
శ్రీకాకుళం నగరంలోని మంగువారి తోట 36, 37 డివిజన్ల అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం చిన్నారులకు గజ్జెల పండుగ, గోరింటాకు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, విద్యారంభం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు దుస్తులు, ఆహారపు తట్టలు పంపిణీ చేశారు. ఐసీడీఎస్ అధికారి పి. నాగరాణి చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం, పోషణపై శ్రద్ధ వహించాలని సూచించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం, పోషక విలువలపై అవగాహన కల్పించి, ఆరోగ్య పరీక్షలు, ఉచిత మందులు అందజేశారు. అంగన్వాడీ కేంద్రాలు పిల్లల సమగ్ర వికాసానికి తోడ్పడతాయని నాయకులు రోణంకి జ్యోతి కళ్యాణ్, భరణి కుమార్ త్రిలోచన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్