శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి గ్రామ ఇలవేల్పు కొత్తమ్మతల్లి జాతరకు ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడు ఏర్పాటులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది కొత్తమ్మ తల్లి జాతర సందర్భంగా హెలికాప్టర్ రైడ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేసి ప్రజలకు ప్రత్యేక అనుభూతిని కలిగించేలా చర్యలు చేపట్టాలని మంత్రి అచ్చన్న సూచించారు. దీనికి సంబంధించి అవసరమైన అనుమతులు, భద్రతా ప్రమాణాలు, పార్కింగ్, రాకపోకల ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.