కలెక్టర్ తో ఇచ్చాపురం ఎమ్మెల్యే భేటీ

0చూసినవారు
కలెక్టర్ తో ఇచ్చాపురం ఎమ్మెల్యే భేటీ
ఇచ్చాపురం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ మంగళవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో భేటీ అయ్యారు. బారువా సామాజిక ఆరోగ్య కేంద్రం, సోంపేట డయాలసిస్ కేంద్రాల వద్ద డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. రోగులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించి, డ్రైనేజీ వ్యవస్థ పునర్నిర్మాణానికి, మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్