ఆచార్య ఎన్ జి రంగా విశ్వ విద్యాలయం (ANGRAU) వైస్ ఛాన్సెలర్ డా. పి. వి. సత్యనారాయణ, శ్రీకాకుళంలోని నైరా వ్యవసాయ కళాశాలను సోమవారం సందర్శించారు.
విద్యార్థులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుని, రైతులకు ఉపయోగపడే పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. అసోసియేట్ డీన్ డా. డి. చిన్నం నాయుడు ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు,
విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడిన ఆయన, కళాశాల విభాగాలు, సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించి కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మొక్కలు నాటి, ఈఎల్పీ
విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి విత్తనాలను కొనుగోలు చేశారు.