
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
TG: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన భర్త హత్య కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి, ఉరివేసి గుండెపోటుగా చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, మృతుడి మెడపై గాట్లు గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు భార్య, ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.




