శ్రీకాకుళం జిల్లాలో 22 ఆశా కార్యకర్తల పోస్టులు భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సంబంధిత గ్రామం/వార్డుకు చెందిన మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10th ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 25-45 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులు. స్థానిక పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు 10, 000 చొప్పున జీతం అందించనున్నారు.