స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు న్యాయం చేయాలి.. కార్మిక సంఘాలు

2చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని, కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలని సిఐటియు, ఎఐటియుసి, ఐ.ఎఫ్.టి.యు, సి.ఐ.ఎన్.టి.యు.సి నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద శుక్రవారం కేంద్ర కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఈ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయలు, గాయపడిన వారికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు. విశాఖ స్టీల్ ఎస్ఎంఎస్ దుర్ఘటనలో 10 మంది కార్మికులను కోల్పోవడం బాధాకరమని, ఇలాంటి దుర్ఘటన గతంలో ఎన్నడూ చూడలేదని నాయకులు పేర్కొన్నారు.