కాశీబుగ్గ: ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

1039చూసినవారు
కాశీబుగ్గ: ఉపాధ్యాయురాలు ఆత్మహత్య
కాశీబుగ్గలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు జె. రోహిణి (40) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. మెళియాపుట్టి మండలం తూముకొండ గ్రామానికి చెందిన రోహిణి, పలాస ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితమే ఆమె మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. భర్త జీవనరావు ఇంటికి వచ్చి చూడగా, తలుపులు మూసి ఉండటంతో పాటు లోపలి నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి చూడగా, రోహిణి ఉరి వేసుకుని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్