శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మ
డపాం టోల్ ప్లాజా సమీపంలో ఆదివారం అర్ధరాత్రి వంశధార నది వంతెనపై రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో మంటలు చెలరేగి, ఇద్దరు గాయపడ్డారు. ముందు వెళ్తున్న లారీ బ్రేక్ డౌన్ అవ్వడంతో మరమ్మతుల కోసం రోడ్డు పక్కన ఆపగా, వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ముందున్న లారీ డ్రైవర్, కంటైనర్ డ్రైవర్ ఉన్నారు. నరసన్నపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.