రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి అచ్చన్న

506చూసినవారు
రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి అచ్చన్న
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించి, భూ రికార్డులను మరింత పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో రీ సర్వే పూర్తయిన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను మంత్రి శనివారం పంపిణీ చేశారు. క్యూ ఆర్ కోడ్తో పాటు ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందిస్తున్నామని, 2028 నాటికి రాష్ట్రంలో భూ సమస్యలు లేకుండా చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్