నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో మంత్రి అచ్చున్న ప్రజా దర్బార్

3చూసినవారు
నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో మంత్రి అచ్చున్న ప్రజా దర్బార్
కోటబొమ్మాలి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవటంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. టెక్కలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, స్థానిక నాయకులు క్యాంపు కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని పరిశీలించిన మంత్రి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు సత్వరమే తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్