తుఫాన్ ముప్పుపై అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష

0చూసినవారు
తుఫాన్ ముప్పుపై అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఫోన్లో మాట్లాడి తుఫాన్ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు, తీర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైతే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తుఫాన్ పునరావాస కేంద్రాల్లో మంచినీరు, ఆహారం, విద్యుత్, వైద్యం, పారిశుద్ధ్యంతో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్