మంగళవారం ఉదయం విచారణ నిమిత్తం కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండు రోజులుగా కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆచూకీ తెలియడం లేదు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది సస్పెన్స్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.