ఎంపీ కప్ కబడ్డీ: వండర్ ఉమెన్, వారియర్స్, నౌపడా జట్ల విజయం

847చూసినవారు
శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగిన ఎంపీ కప్ కబడ్డీ-2026 మెగా టోర్నమెంట్ సోమవారం రాత్రి ఉత్సాహంగా ముగిసింది. మహిళల విభాగంలో వండర్ ఉమెన్, పురుషుల విభాగంలో ఉద్దానం వారియర్స్, జూనియర్స్ విభాగంలో నౌపడా జట్లు విజేతలుగా నిలిచాయి. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసునాయుడు సహా పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్