శ్రీకాకుళంలో జోరుగా ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ

0చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతోంది. మొత్తం 523 ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో గురువారం ఉదయం 9 గంటల సమయానికి 8.48 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో 15,69,362 మంది ఓటర్లకు గాను 1,33,120 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమదాలవలసలో అత్యధికంగా 15.11 శాతం, ఇచ్చాపురంలో అత్యల్పంగా 1.85 శాతం ఓటింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటుండగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్