కాలువలో పడిన ఆవును రక్షించిన మున్సిపాలిటీ సిబ్బంది

0చూసినవారు
కాలువలో పడిన ఆవును రక్షించిన మున్సిపాలిటీ సిబ్బంది
శ్రీకాకుళం మండలం PSNM స్కూల్ ఆవరణలో సోమవారం ఉదయం ఓ ఆవు కాలువలో పడిపోయింది. కాలువలో పడిన ఆవు బయటకు రాలేక ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన స్థానికులు మున్సిపాలిటీ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న మున్సిపాలిటీ సిబ్బంది స్థానికుల సహకారంతో ఆవును సురక్షితంగా బయటకు తీశారు. ఈ సందర్భంగా కాలువలకు సరైన మూతలు ఏర్పాటు చేసి, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్