న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న వివిధ రకాల కేసులను రాజీ మార్గంలో సత్వరమే పరిష్కరించు కోవడానికి డిసెంబరు 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా జడ్జి సునీత కొండబోలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.