శ్రీకాకుళం జిల్లాలో గురువారం ఉదయం నుంచి
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రభుత్వం అందించనుంది. జిల్లాలో దాదాపు 3.4 లక్షల మంది ఈ పెన్షన్లు అందుకోనున్నారు. బ్యాంకుల సమ్మె దృష్ట్యా అక్టోబర్ 1న పెన్షన్లు అందించాలని ప్రభుత్వం ముందుగా ప్రకటించినప్పటికీ, బ్యాంకు ఉద్యోగుల సమ్మె విరమణతో రేపు తెల్లవారుజాము నుంచే పెన్షన్లను అందించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ పెన్షన్లను అక్టోబర్ 1వ తేదీన ఉదయం 6:30 గంటల నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి అందించనున్నారు.