రేపు సాయంత్రం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

1058చూసినవారు
రేపు సాయంత్రం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
వాయుగుండం తీరం దాటినప్పటికీ, శుక్రవారం సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ స్పష్టం చేశారు. గురువారం ఉదయం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా శ్రీకాకుళం, పోలాకి, గార, వజ్రపుకొత్తూరు, ఇచ్చాపురం పరిసర ప్రాంతాలలో ఈదురు గాలులు, వర్షాలు కొనసాగుతాయని తెలిపారు. ప్రభుత్వ విభాగాలు, క్షేత్రస్థాయి అధికారులు అత్యవసర సహాయక బృందాలతో నిరంతరం అప్రమత్తంగా ఉండి, సహాయ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు అత్యవసర పనులకు తప్ప బయట తిరగరాదని, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని భావించవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్