శ్రీకాకుళంలో పోలీసుల విస్తృత వాహన తనిఖీలు
శ్రీకాకుళం నగరంలో ఆదివారం ఉదయం 80-ఫీట్ రోడ్డులో వన్ టౌన్ ఎస్.ఐ. రామారావు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా, పెండింగ్ చలాన్ల క్లియరెన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు భద్రతా నియమావళిపై కౌన్సిలింగ్ వంటి బాధ్యతలను నిర్వహిస్తున్నామని ఎస్.ఐ. తెలిపారు. జిల్లా ఎస్.పి. మహేశ్వర రెడ్డి సూచనల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
