ఎడ్ల గోపాలరావుకు రోటరీ క్లబ్ ఘన సన్మానం

684చూసినవారు
అమడవలసలో ఆదివారం స్థానిక రోటరీ క్లబ్ సభ్యులు పద్మశ్రీ పురస్కార గ్రహీత, తెలుగు పద్యనాటక రంగంలో విశేష సేవలందించిన ఎడ్ల గోపాలరావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కళాకారులు, సాహితీవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. నాటకరంగంలో గాన ప్రతిభ, పద్య పఠనంలో ప్రత్యేకతతో 'నక్షత్రకుడు'గా పేరుగాంచిన గోపాలరావు 5,000 పైగా ప్రదర్శనలు ఇచ్చారని, రంగస్థలం తనకు జీవనాధారమని, ఈ గుర్తింపే నిజమైన బహుమతి అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్