హింస బాధితుల కోసం 'సఖి' వన్ స్టాప్ సెంటర్ ప్రారంభం

6చూసినవారు
హింస బాధితుల కోసం 'సఖి' వన్ స్టాప్ సెంటర్ ప్రారంభం
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 'సఖి' వన్ స్టాప్ సెంటర్ నూతన భవనాన్ని మంగళవారం శాసన సభ్యులు గొండు శంకర్, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి. శోభారాణి ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా శారీరక, లైంగిక, మానసిక, ఆర్థిక వేధింపులు, గృహ హింస, లైంగిక దాడులు, అక్రమ రవాణా, యాసిడ్ దాడులు వంటి హింసకు గురైన మహిళలకు వైద్య, న్యాయ, కౌన్సెలింగ్, మానసిక సహాయం వంటి సమగ్ర సేవలు ఒకే చోట అందించబడతాయి. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ సేవలు అందుబాటులో ఉంటాయి. 18 ఏళ్ల లోపు బాలికలకు పోక్సో చట్టం ప్రకారం రక్షణ, సహాయ సేవలు అందిస్తారు. బాధితులు భయపడకుండా కేంద్రాన్ని సంప్రదించి సహాయం పొందాలని సూచించారు.

సంబంధిత పోస్ట్