రేగిడి మండల సంకిలి గ్రామానికి చెందిన సీనియర్
టీడీపీ నాయకులు, రైతు సంఘం జిల్లా నాయకులు జనార్ధన్ రావు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన 2019లో రేగిడి మండల
టీడీపీ జడ్పీటీసీగా ఎన్నికల్లో పోటీ చేశారు. రైతు సంఘం తరఫున ఎన్నో పోరాటాలు చేసి రైతులకు మేలు చేశారు. రాష్ట్ర స్థాయి చెరుకు రైతుల సంఘం సభ్యులుగా కూడా పని చేశారు. పలువురు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.