తండ్రికి వీల్‌చైర్‌పై వచ్చి తలకొరివి పెట్టిన కుమారుడు

1575చూసినవారు
తండ్రికి వీల్‌చైర్‌పై వచ్చి తలకొరివి పెట్టిన కుమారుడు
జి.సిగడాం మండలం మర్రివలస పంచాయతీ మానంపేట గ్రామానికి చెందిన కంచెర్ల సవర్రాజు(62) రెండు నెలల కిందట పక్షవాతంతో మంచం పట్టి మంగళవారం మృతి చెందాడు. ఆయన కుమారుడు సురేష్ రెండేళ్ల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌తో మంచాన పడ్డాడు. తండ్రి మృతితో వీల్‌ఛైర్ సహాయంతో శ్మశానవాటికకు చేరుకుని తలకొరివి పెట్టాడు. భర్త మృతి, కుమారుడి పరిస్థితి చూసి తల్లి మీన రోదించింది. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.

సంబంధిత పోస్ట్