తలసేమియా చిన్నారుల కోసం ప్రత్యేక రక్తదాన శిబిరాలు

0చూసినవారు
తలసేమియా చిన్నారుల కోసం ప్రత్యేక రక్తదాన శిబిరాలు
శ్రీకాకుళం జిల్లాలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం సెప్టెంబరు 1 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ విశ్రాంత సీఈఓ పల్లి శ్రీరాములు బుధవారం తెలిపారు. ప్రముఖ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని, ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ 14 రోజుల సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛంద రక్తదానమే ప్రాణాలను కాపాడే ఏకైక మార్గమని, అందరూ ముందుకు రావాలని జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ పి. జగన్మోహనరావు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్