జిల్లాలో చికెన్ ధరలు గత వారం కన్నా పది రూపాయలు తగ్గాయి. ఆదివారం లైవ్ కోడి కిలో 155 రూపాయలు, స్కిన్ తో 240, స్కిన్ లెస్ కిలో 260 రూపాయలకు అమ్ముడవుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల కారణంగా వ్యాపారాలు మందగించాయని, దసరా తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.