శ్రీకాకుళం : ఘనంగా కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్

2చూసినవారు
శ్రీకాకుళం : ఘనంగా కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్
శ్రీకాకుళం జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం (డీపీటీసీ)లో 2025–26 బ్యాచ్‌కు చెందిన 142 మంది ఎస్‌సీటీ సివిల్ పోలీస్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన పోలీసులకు ఉత్సాహం నింపారు. జిల్లా ఎస్పీ కె. వి. మహేశ్వర రెడ్డి, కలెక్టర్ స్వప్నీల్ పుండ్కర్ దినకర్ తదితర అధికారులు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ క్రమశిక్షణతో నిర్వహించిన మార్చ్‌ఫాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమం అనంతరం నూతన పోలీసులతో అధికారులు గ్రూప్ ఫొటో దిగారు.

సంబంధిత పోస్ట్