శ్రీకాకుళం నగరంలో, వన్ టౌన్ ఎస్.ఐ. హరికృష్ణ నేతృత్వంలో పోలీసులు ఆదివారం సాయంత్రం ప్రభుత్వ మహిళా కళాశాల రోడ్డులో వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా, పెండింగ్ చలాన్ల క్లియరెన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు భద్రతా నియమాలపై కౌన్సిలింగ్ వంటి బాధ్యతలను ఈ తనిఖీలలో చేపట్టినట్లు హెచ్.సి. పార్వతీశం తెలిపారు. జిల్లా ఎస్.పి. మహేశ్వర రెడ్డి సూచనల మేరకు ఈ విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.