శ్రీకాకుళం నగరపాలక సంస్థకి అవార్డుల పంట

1చూసినవారు
శ్రీకాకుళం నగరపాలక సంస్థకి అవార్డుల పంట
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డులు -2026 లో విశేష ప్రతిభ కనబరిచిన శ్రీకాకుళం నగరపాలక సంస్థ కి పలు విభాగాల్లో అవార్డుల పంట పండింది. రాష్ట్రస్థాయిలో వివిధ విభాగాలలో ప్రతిష్టాత్మక పురస్కారాలను కైవసం చేసుకుంది. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నగరపాలక సంస్థ కమిషనర్ జి శ్రవణ్ కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రవి కిరణ్ ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డులు అందుకున్నారు.