శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ జలదిగ్బంధం: ప్రయాణికుల అవస్థలు

1చూసినవారు
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ జలదిగ్బంధం: ప్రయాణికుల అవస్థలు
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ పల్లపు ప్రాంతంలో ఉండటంతో వర్షపు నీరు చొచ్చుకు వచ్చి జలమయమైంది. ప్రాంగణమంతా నీరు చేరడంతో ప్రయాణికులు మోకాళ్ల లోతు నీటిలో నడవాల్సి వస్తోంది. లగేజీలు, చిన్నపిల్లలతో వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి పునరావృతమవుతున్నా, సంబంధిత యంత్రాంగానికి పట్టడం లేదని మంగళవారం ప్రయాణికులు విమర్శిస్తున్నారు.

సంబంధిత పోస్ట్