పిల్లల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే రక్షకులు: సీనియర్ సివిల్ జడ్జి కె. హరిబాబు

5చూసినవారు
పిల్లల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే రక్షకులు: సీనియర్ సివిల్ జడ్జి కె. హరిబాబు
నేటి డిజిటల్ యుగంలో పిల్లలు స్మార్ట్ఫోన్లకు, గేమ్స్క బానిసలవుతూ చదువుతో పాటు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారని, వారిని ఈ ఉచ్చు నుంచి కాపాడటంలో ఉపాధ్యాయులే తొలి రక్షకులుగా నిలవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె. హరిబాబు పిలుపునిచ్చారు. నల్సా ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు బాలల హక్కులు, సైబర్ నేరాలు, మొబైల్ దుర్వినియోగంపై శ్రీకాకుళంలో సోమవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన హరిబాబు మాట్లాడుతూ, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం తెచ్చేందుకు ప్రతి పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, 16 ఏళ్ల లోపు పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వకుండా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్